ఫ్లాష్ ఫ్లాష్
షాద్ నగర్ బిజెపి కార్యకర్త ప్రశాంత్ ను గెంటివేసిన ఆందోళనకారులు
షాద్ నగర్ ఎమ్మెల్యే సమక్షంలో ప్రశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
మైకు లాక్కుని బయటికి పంపిన నేతలు
బంద్ లో ప్రశాంత్ పై కొందరు “చేయి” చేసుకున్న ఘటన
షాద్ నగర్ బిజెపి కార్యకర్త ప్రశాంత్ బంద్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనకారులు అతన్ని కొట్టి గెంటివేశారు. 42% రిజర్వేషన్ ఎవరిని అడిగి ఇచ్చారు అసలు ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఈ ఆందోళనకు కారణం ఏమిటని బంద్ లో పాల్గొని మాట్లాడడంతో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బిసి సేన బీసీ జేఏసీ ఇతర విద్యార్థి సంఘాలు అతన్ని వారించాయి. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా డిపో ముందు వక్తలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మైకు తీసుకొని మాట్లాడుతున్న సమయంలో ప్రశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ బంద్ ఎవరి కోసం చేస్తున్నారు హైకోర్టుపైన సుప్రీంకోర్టు పైన లేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేకపోతే ఇతర పార్టీలపైన చేస్తున్నారా ఈ ఆందోళనకు బందుకు అసలు ఏమిటి సంబంధమని నిలదీశారు. బీసీలను కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ఇతర అన్ని పార్టీలు మోసం చేశాయని ఎవరు అతిథులు కాదని మాట్లాడారు. బిసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవరు కోర్టులో కేసు వేసిన మాధవరెడ్డి పైన మీరు బంద్ చేస్తున్నారా లేక రేవంత్ రెడ్డి కోసం బంద్ చేస్తున్నారా అని నిలదీయడంతో అక్కడ ఉన్న ఆందోళనకారులు బిసి వర్గాలు ఒక్కసారిగా పైకి లేచి ప్రశాంత్ వద్ద మైకు లాక్కున్నారు. ఇదేం పద్ధతి మాట్లాడే తరీఖా లేదా అని పలువురు వారించారు. వారించిన అలాగే మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు వెనుక నుండి ప్రశాంత్ పై చేయి చేసుకున్నారు. అక్కడినుండి ప్రశాంత్ ను బలవంతంగా గెంటివేస్తుండగా పోలీసులు రంగా ప్రవేశం చేసి అతనిపై దాడి జరగకుండా బయటికి పంపించేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బీసీ ద్రోహి అంటూ ప్రశాంత్ ను అక్కడి నుండి పంపించేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు రఘునాయక్ మాట్లాడుతూ కొంతమంది బిసి ద్రోహులు ఆందోళన ముసుగులో వచ్చి ధర్నాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వారి చేష్టలను విశ్వసించబోమని అన్నారు. ప్రశాంత్ మాత్రం తన ప్రసంగాన్ని సమర్థించుకున్నారు. పోలీసులు మాత్రం ప్రశాంత్ ను అక్కడ ఉండకూడదని పంపిచేశారు