బీసీ జేఏసీ బంద్ ప్రభావం – బస్సులు డిపోలకే పరిమితం, సకల సబ్బండి మద్దతు

బీసీ జేఏసీ బంద్ ప్రభావం – బస్సులు డిపోలకే పరిమితం, సకల సబ్బండి మద్దతు

  • తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌తో బంద్ విజయవంతం

  • నిజామాబాద్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు

  • వ్యాపారులు, సబ్బండి స్వచ్ఛందంగా మద్దతు

  • మాజీ జెడ్పీ చైర్మన్ బి,ఆర్ యెస్ రాష్ట్ర కార్యదర్శి  దాదన్న విఠల్ రావు ఉద్యమానికి పిలుపు

బీసీ జేఏసీ బంద్ ప్రభావం – డిపోలకే పరిమితమైన బస్సులు, ప్రయాణికులకు ఇబ్బందులు



బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌కు నిజామాబాద్ జిల్లాలో విస్తృత మద్దతు లభించింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న విఠల్ రావు మాట్లాడుతూ, బీసీల హక్కుల కోసం తెలంగాణ సాధన తరహాలోనే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.



నిజామాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు వంటి కీలక డిమాండ్లతో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం బంద్ విజయవంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు సకల సబ్బండి సంఘాలు విస్తృత మద్దతు ప్రకటించాయి.

వేకువజాముననే నిరసనకారులు రహదారులపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ల సాధన నినాదాలు చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న విఠల్ రావు మాట్లాడుతూ, “బీసీలకు రిజర్వేషన్లు సాధించడానికి మనం తెలంగాణ సాధన సమయంలో చూపిన ఐక్యతను మళ్లీ ప్రదర్శించాలి. ఇది కేవలం బీసీల సమస్య కాదు, ఇది సామాజిక న్యాయ పోరాటం” అని అన్నారు.

బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment