నిర్మల్ నుండి కాశీ -అయోధ్యకు బస్సు
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17
నిర్మల్ ఆర్టీసీ డిపో నుండి ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం, కాశీ ( వారణాసి ) అయోధ్యకు ఈ నెల 27 వ తేదీ సోమవారం బస్సు ప్రారంభిస్తున్నట్లు డిపోమేనేజర్ పండరి తెలిపారు. 27వ తేదీ మధ్యాహ్ననం 1 గంటలకు నిర్మల్ నుండి బయలుదేరి తెల్లవారు 28 వ తేదీన ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచారించి మధ్యాహ్ననం 2 గంటలకు కాశీ ( వారణాసి ) చేరుకుంటుంది. ఆ రోజు రాత్రి కాశీ లోనే బస్సు ఉంటుంది. భక్తులు కాశీ విశ్వనాథ టెంపుల్, విశాలక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, గంగా హారతి అన్ని ఘాట్ లు దర్శించుకున్న తర్వాత 29 వ తేదీ మద్యహ్నమ్ 3 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ బాల రాముని దర్శనం అయోధ్యలో వివిధ దేవాలయాలు దర్శించుకొని రాత్రి అయోధ్య నుండి బయలు దేరి 30 వ తేదీ రాత్రి నిర్మల్ చేరుకుంటుంది. ఒకరికి రూ. 6400లు ఉంటుందని భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని, బుకింగ్ కొరకు నిర్మల్ బస్టాండ్ నందు కాని మా అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in సర్విస్ నంబర్ 99999లో కాని టికెట్ బుక్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9959226003, 83280 21517, 7382842582 లో సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ సౌకర్యాన్ని నిర్మల్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు