రోగులకు ఉచితంగా మందులు పంపిణీ
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17
మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ గడ్డం సుభాష్ తన వంతు బాధ్యతగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఆపదలో ఆపద్బాంధవుడిలా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. డబ్బులు పెట్టి తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి వంద రోజులకు సరిపడే విధంగా మాత్రలు ఇవ్వడం జరిగింది. మేకల గంగన్న, ముత్యాల శంకర్, ముత్యాల గంగాధర్, ఓం ప్రకాష్, వచ్చల బాయి, సట్వాబాయి, ఇడెపోల్ల పండరి, ఆనందులోల్ల రాజు తో పాటు ఇతర వ్యాధి గ్రస్తులకు మందులు పంపిణీ చేయడం జరిగింది. వైద్యులు రోగులకు సూచించిన మందులనే ఇవ్వడం జరిగిందన్నారు. తన వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటానని వెల్లడించారు. వంద రోజులకు సరిపడా మందులు ఇవ్వడం పట్ల రోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీడీసీ అధ్యక్షుడు గుంజలోల్ల నారాయణ, మాజీ కోశాధికారి మేత్రి సాయినాథ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు