పంచాయితీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం – ముఖ్య సూచనలు జారీ

పంచాయితీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం – ముఖ్య సూచనలు జారీ

పంచాయితీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం – ముఖ్య సూచనలు జారీ

మనోరంజని తెలుగు టైమ్స్ మంచిర్యాల ప్రతినిధి అక్టోబర్ 17

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపిడిఓ జి. సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో మండలంలోని పంచాయితీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఈ నెలాఖరుకల్లా వసూలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో సానిటేషన్ లోపాలు లేకుండా తడి, పొడి చెత్త వేరుగా సేకరించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి, ఉన్నతాధికారుల తనిఖీలకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆర్టీఐలు పెండింగ్ లేకుండా సమయానికి సమాధానం ఇవ్వాలని, ఆడిట్ అభియోగాలను డ్రాప్ చేయించి రిపోర్ట్ సమర్పించాలని తెలిపారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉంటే చెల్లించాలని ఆదేశించారు. ఇజిఎస్ గ్రామ సభలు, సోషల్ ఆడిట్ ప్రజా వేదిక మీటింగ్‌లలో సక్రమంగా పాల్గొనాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏపీవో బి. బాలయ్య, హౌసింగ్ ఎఈ కాంక్ష, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment