బి. సి. సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతూ
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బి. సి సంఘాల ఆధ్వర్యంలో రేపు చేపడుతున్న బంద్ కు సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావ్ బంద్ కు మద్దత్తు తెలిపారన్నారు. తాను ఒక బి. సి. నాయకుడినని బి. సి. లకు 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం లో పాల్గొంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆ సమర్థత వల్లే బి. సి. లకు అన్యాయం జరుగుతుందన్నారు. రేపు చేపట్టే బంద్ లో మండలాల వారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.