విద్యార్థినిలకు నోటుబుక్కులు-పెన్నులు పంపిణీ

విద్యార్థినిలకు నోటుబుక్కులు-పెన్నులు పంపిణీ

విద్యార్థినిలకు నోటుబుక్కులు-పెన్నులు పంపిణీ

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17

మండల కేంద్రమైన ముధోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)-ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిలకు డాక్టర్ సరస్వతి ఆనంద్ పరివార్ మహారాజ్ బ్రహ్మేశ్వర్ తాను స్వయంగా 275 నోటుబుక్కు, పెన్నులు, 10వ తరగతి విద్యార్థులకు పెన్ను, నోటుబుక్కు, పరీక్ష ప్యాడ్లు ఉదార స్వభావంతో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సరస్వతి ఆనంద్ మహారాజ్ బ్రహ్మేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రమశిక్షణతో చదువుకొని అమ్మ నాన్నలను,గురువులను గౌరవిస్తూ మంచి స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కొరకు తన వంతు సాయం ఎల్లవేళలా చేయడానికి నిరంతరం తపిస్తానని, అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందానికి, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు గీతా మాట్లాడుతూ పాఠశాలలా విద్యార్థినులకు మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువలేమని, ఎల్లవేళలా విద్యార్థినిలకు సాయపడాలని అన్నారు. ఈ సందర్భంగా స్వామీజీని పాఠశాల తరఫున సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, స్వర్ణలత, నీరజ మేడం, అంజుం, కొక్కుల గంగాధర్, సరితా దేవి, లక్ష్మి, ఉషా కిరణ్ మై, కవిత, ఉపాధ్యాయులు విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment