బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు..
— రేపటి బీసీ బంద్‌ని జయప్రదం చేయాలి: డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నర్సాపూర్ ప్రతినిధి అక్టోబర్ 17
బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని, రేపటి బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలని కోరుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. అయితే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లులకు అడ్డుపడుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిల్లుపై నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడలేదని అన్నారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. బంద్ లో కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలని కోరారు