శీర్షిక కల్తీ కాలనాగు

శీర్షిక కల్తీ కాలనాగు

శీర్షిక కల్తీ కాలనాగు

శీర్షిక కల్తీ కాలనాగు

కల్తీ మందులు కల్తీ రసాయన ఎరువులతో
పంటలు పండిస్తూ కల్తీ కాలనాగును పెంచి పోషిస్తున్నాం

శకుని ఆకలి కేకలు మరచి పోయమా
అన్నమే దొరకని ఓ రోజు వస్తుందని
మరచి పోయాం

ప్రకృతి మాత పచ్చకోకను చించేసి
అరణ్యాలు మింగేసి
తెగిన గాలిపటంలా
ఆనందాన్ని అనుభవిస్తున్నాం

ప్లాస్టిక్‌ను పకృతి మాత కడుపులో పడేస్తూ
పడగ విప్పిన కాలుష్య కాలనాగు క్రింద ఉన్నామని మరచి పోతున్నాం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మరచి
ధన దర్పంతో విందులు వినోదాల పేరుతో
మిగిలిన అన్నం ను పడేస్తూ
వీధి చివర చెత్త డబ్బాల దగ్గర
ఎండిన డొక్కలతో ఆకలితో అలమటిస్తున్న అనాధలను మరచి పోతున్నాం

పకృతి మన ఇంటి రేపటి దీపాలను
ఆర్పేయక ముందే ప్లాస్టిక్ వాడకాన్ని
కల్తీ రసాయన ఎరువులను
పూర్తిగా మానేయడం మరియు చెట్లను నాటడం
చెయ్యాలని కోరుకుంటూ
రచన మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218

Join WhatsApp

Join Now

Leave a Comment