బాన్స్వాడలో కాంగ్రెస్ సంఘటనా సృజన్ అభియాన్ కార్యక్రమం ఘనంగా
తేదీ: అక్టోబర్ 16, 2025
ప్రాంతం: బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా
బాన్స్వాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల (DCC) ఎంపికకు సంబంధించి సంఘటనా సృజన్ అభియాన్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సిరాజ్ పాల్ సింగ్ కరోలా, డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్స్వాడ మండలాలతో పాటు బాన్స్వాడ టౌన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ బలపర్చడం, నాయకత్వ ఎంపికపై స్థానిక స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా PR గార్డెన్ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా, పార్టీ జెండాలు, నినాదాలతో బాన్స్వాడ వీధులు సందడిగా మారాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.