బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ కి పూర్తి మద్దతు.
భీమారం బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
18 వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కి భీమారం మండల బీసీ సంఘాల ఐఖ్య వేదిక తురుపున సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిరసనలు చేపడతామని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
అగ్రవర్ణలు చేస్తున్న కుట్రలో భాగంగా బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో వ్యతిరేకంగా కేసు వేయటం వల్ల,తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జెఎసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ నేపథ్యంలో భాగంగా భీమారం మండల బీసీ కుల సంఘాల ఐఖ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని బీసీ కుల సంఘాల వారు పాల్గొని కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కార్యాచరణ ప్రణాళిక చేసుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో భీమారం మండలంలోని అన్ని గ్రామాల బీసీ కుల సంఘాల వారు హాజరయ్యారు.