జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం
పోస్టర్ ఆవిష్కరించిన ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 16
జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేదలకు వరంగా మారిందని ముధోల్ ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో జీఎస్టీ జిల్లా కన్వీనర్, బీజేపీ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి యాతలం చిన్నారెడ్డితో కలిసి జీఎస్టీ తగ్గింపు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 18 శాతం నుండి 5 శాతం జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అనేక రంగాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. పేదల ఇండ్లలో దీపావళి పండుగ వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జిఎస్టి తగ్గింపు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ జిల్లా కో-కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, బీజేపీ పట్టణ, గ్రామీణ అధ్యక్షులు రావుల రాము, సీరం సుష్మారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్, వెంగళరావు, తదితరులు పాల్గొన్నారు.