తెలంగాణ బీసీ బంద్కు ముంబై బీసీ సంఘాల సంఘీభావం
మనోరంజని తెలుగు టైమ్స్ – బాల్కొండ అక్టోబర్ 17,
రేపు (అక్టోబర్ 18) తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన “బంద్ ఫర్ జస్టిస్” ఉద్యమానికి ముంబై బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 42% రిజర్వేషన్లు అమలు కావాలని మరియు బీసీలకు న్యాయమైన వాటా ఇచ్చే వెన్నుపోరాటం కొనసాగించాలని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేనట్టుగా, దశాబ్దాలుగా అన్యాయం పాలిత బహుజన సమూహాలకు ఈ బంద్ ఒక న్యాయబద్ధమైన ప్రయత్నమని తెలియజేశారు. పత్రిక ప్రకటనలో, భారత రాజ్యాంగం సవరణ ద్వారా బీసీలకు ప్రత్యేక హక్కులు మరియు రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉందని హై లైట్ చేశారు. మహనీయులైన ఫూలే, అంబేడ్కర్ల సూచనలను ఉద్దేశిస్తూ, తమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ సందర్భంలో ముంబై బహుజన ఫోరం కన్వీనర్ సి.హెచ్. గణేష్ ముదిరాజ్, ముంబై కురుమ సంఘం ఖార్ బంద్రా అధ్యక్షులు గవ్వల శ్రీనివాస్, ముంబై తెలుగు బెస్త గంగపుత్ర సమాజ్ ప్రధానులు రణవేణి లక్ష్మణ్, మహాలక్ష్మి దొభీఘాట్ తెలుగు రజక సంఘం ప్రధాన కార్యదర్శి తడకపెల్లి నరేష్, తెలుగు రజక సంఘం అంటాప్ హిల్ అధ్యక్షులు నడిగోటి వెంకటేష్, ముంబై లంబాడీ (బంజారా) సంఘం కన్వీనర్ బనావత్ రవి నాయక్, నవీ ముంబై మంగలి (నాయి) సంఘం అధ్యక్షులు మందపెల్లి లక్ష్మణ్, థానే గౌడ సంఘం నాయకులు శీలం భూమన్న, భీవండి పద్మశాలి సీనియర్ నేత భోగ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు