భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాందేడ్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ ప్రకాష్ రాథోడ్
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా, అక్టోబర్ 16:
నాందేడ్ జిల్లా ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాథోడ్ ప్రకాష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఆయన స్వస్థలం కాగా, తన జిల్లాలో ఉన్న సబ్ డివిజన్ అధికారి అజ్మీర సంకేత్ కుమార్ ఐఏఎస్‌ను కలవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఇద్దరూ గిరిజన వర్గానికి చెందినవారనే గర్వాన్ని పంచుకున్నారు. రాథోడ్ ప్రకాష్ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత హోదాలో పనిచేస్తూ, గిరిజన యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవలు, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అవకాశాలపై ఇరువురూ చర్చించారు.