*_బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.._*
_హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు._
_హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు._
_2025, అక్టోబర్ 16వ తేదీన ఈ పిటీషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు దాన్ని డిస్మస్ చేసింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందునా పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది._
_లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025, అక్టోబర్ 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది._
_ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం (అక్టోబర్ 16) విచారణ చేపట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు._
_కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6 శాతం ఉన్నట్టు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫార్సులు చేసిందని.. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని కోర్టుకు తెలిపారు._
_ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందునా పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని.. అక్కడే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది._