టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15
నిజామాబాద్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిర్పరాజు, బి. నాగేశ్వర్ రావు, మాకు రవి, చింతకాయల రాజు, న్యాళం రమేష్, మెతుకు శివ కుమార్, ఉమాపతి రావు, బి. శ్రీనివాస్ రావు, కిష్టయ్య, సంగ్య నాయక్, సాదిక్, విజయ్ కుమార్, కృష్ణ, గంగారాం, ఫయీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు