కారుణ్య నియామకాలతోనే ఐకెపి సిబ్బందికి భరోసా : టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్

కారుణ్య నియామకాలతోనే ఐకెపి సిబ్బందికి భరోసా : టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 15

కారుణ్య నియామకాలతోనే ఐకెపి సిబ్బందికి భరోసా : టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో, ఇటీవల అకాల మరణం చెందిన ఐకెపి సిసి రాజేశ్వర్ కుటుంబాన్ని జిల్లా ఐకెపి సిబ్బంది పరామర్శించారు. సిబ్బంది విరాళాల ద్వారా సేకరించిన ₹75,000 మొత్తాన్ని టీఎన్జీవో కార్యదర్శి నేతికుంట శేఖర్, ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్, జిల్లా జేఏసీ చైర్మన్ బత్తుల మాణిక్యం, రవి విఠల్ లు కలిసి మృతుడి భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల ఫైలు ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరిందని, మృతుడి కుటుంబానికి త్వరలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఐకెపి సిబ్బంది 25 సంవత్సరాలుగా పేద మహిళల సంక్షేమం కోసం సేవలందిస్తున్నారని, వారి సేవలను గుర్తించి కారుణ్య నియామకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్, జిల్లా జేఏసీ చైర్మన్ బత్తుల మాణిక్యం మాట్లాడుతూ, సిబ్బంది సహకారంతో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, సలహాదారు ప్రభాకర్, భీమ్గల్ తాలూకా అధ్యక్షుడు సృజన్ కుమార్, ఆర్మూర్ తాలూకా అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, ఐకెపి జిల్లా జేఏసీ అధ్యక్షులు భత్తుల మాణిక్యం, సిసి యూనియన్ జిల్లా అధ్యక్షులు రవి, ఎంఎస్‌సిసి యూనియన్ జిల్లా అధ్యక్షులు విఠల్, ఏపీఎం యూనియన్ ప్రధాన కార్యదర్శి ముఖీం, తడకల శ్రీనివాస్, నవీన్, గాజుల శీను, మహేందర్, సంతోష్, మురళి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment