బైంసాలో జిల్లా స్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

బైంసాలో జిల్లా స్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

బైంసాలో జిల్లా స్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15

గో సేవ విభాగం జిల్లా ఆధ్వర్యంలో బుధవారం బైంసా పట్టణంలోని నరసింహ మందిరంలో జిల్లాస్థాయి ( లెవెల్- 2) గోవిజ్ఞాన పరీక్షలు వివిధ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించబడ్డాయి. పరీక్షలో గోవిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గో సేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ మాట్లాడుతూ గోవు యొక్క విశిష్టత, గో సంతతి వల్ల లాభాలను వివరిస్తూ గోవు సంతతి పెరుగుతెనే భూసారం పెరుగుతుందని, గోవుల వల్ల పాల ఉత్పత్తి పెరిగీ మనమంతా ఆరోగ్యంగా ఉంటామన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 33కోట్లకు గో సంతతి125 కోట్లు ఉండేవని ప్రస్తుతం జనాభా 140 కోట్లు మొత్తం గోవుల సంఖ్య 20కోట్లు కూడా లేవని అన్నారు. ప్రతీ కుటుంబం కనీసం ఒక ఆవును పెంచాలని ప్రతి గ్రామంలో గోశాల ఉండాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ టోలీ సభ్యులు నూకల సురేష్, సరుకొండ దామోదర్, మాధవరావు, లింగారెడ్డి, జిల్లా సహ సంఘ చాలక్ సాదుల కృష్ణ దాస్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment