సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

సబ్- కలెక్టర్కు వినతి పత్రం అందజేత

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ముధోల్ నుండి బైంసా వరకు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. అనంతరం బైంసా పట్టణంలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంకేత కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రెండు రోజుల్లో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కిసాన్ సంఘ్ ప్రతినిధులు తెలిపారు. రెండు రోజులపాటు రైతులు చేపట్టిన పాదయాత్రకు కిసాన్ సంఘ్ ప్రతినిధులతో పాటు వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment