డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి
భైoసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15
మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని ఆర్ఎంపి అసోసియేషన్ బైంసా డివిజన్ అధ్యక్షులు మోహన్ సూచించారు. ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా గోపాల్ నగర్ కాలనీలో సంఘర్ష యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బుద్ధుడు చూపించిన మార్గంలో ప్రయాణించి అభివృద్ధికి మార్గదర్శకులుగా ఉండి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని కాలనీలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నరువాడే అవధూత్ పాటిల్, కపిల్ దగ్డే, సుమిత్ మందేల్, కిరణ్ గోనే రావు, ఆకాష్ మదినే, అశోక్ చంద్రీకర్, డాక్టర్ విజయ్ కుమార్ అర్కులవార్, రమేష్, తదితరులు పాల్గొన్నారు,