సొయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
జిల్లా ఇంచార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15
బహిరంగ మార్కెట్ లో సొయాపంటకు ధర లేక రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని తక్షణమే ప్రభుత్వం సొయాకొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతంగానికి మద్దతు ధర కల్పించాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వినతి పత్రాన్ని అందించారు. బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబులతో కలిసి వెళ్లి అయన హైదరాబాద్ లో ఇంచార్జి మంత్రి ని కలిశారు. ఇప్పటికే ఆలస్యం అయిందని తక్షణమే కొనుగోళ్ల కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముధోల్ నియోజకవర్గంలో రైతులు పెద్ద మొత్తంలో సొయా పంటను పండిస్తారని ఇంచార్జి మంత్రి కి వివరించారు. ఆదే విధంగా భారీ వర్షాలతో నష్టపోయిన రైతంగాన్ని అదుకోవాలన్నారు. నాలుగైదు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యేలా ఎమ్మెల్యే గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి మంత్రులకు అధికారులకు సమస్యను విన్నవించారు.