డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం
మనోరంజని, తెలుగు టైమ్స్, నిర్మల్ ప్రతినిధి | అక్టోబర్ 15
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్‌గామ్ చౌరస్తా వద్ద, డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాన్‌గా ప్రసిద్ధి చెందిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ –”డా. కలామ్ దేశానికి నిస్వార్థంగా సేవ చేశారు. భారత క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో ఆయన పాత్ర అపూర్వం. విద్యార్థుల పట్ల ఆయన చూపిన ప్రేమ కారణంగా ఈ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా గుర్తించబడుతోంది,” అన్నారు. అలాగే ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’తో సత్కరించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలామ్ గారి జయంతి మరియు వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈద్‌గామ్ చౌరస్తా వద్ద డా. కలామ్ గారి కాంస్య విగ్రహం, అలాగే ఆయన రూపొందించిన మిస్సైల్ నమూనాను ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ –”కలామ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో దేశానికి వన్నె తెచ్చారు. భారత్‌ను అణు శక్తి మరియు క్షిపణి శక్తి రంగాల్లో ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందేలా చేశారు,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ మసూద్, షేఖ్ ఖలీల్, రయీస్‌ఉద్దీన్, అబ్దుల్ వాజీద్, జరీఫ్, మొహసిఫ్, రహీమ్, అసద్, తాజీమ్, తన్వీర్ తదితర యువత పాల్గొన్నారు.
కలామ్ గుణం యూత్ మరియు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.