టెన్త్ విద్యార్థులు లక్ష్యసాధనకై శ్రమించాలి ప్రముఖ కవి కొండూరు పోతన్న

టెన్త్ విద్యార్థులు లక్ష్యసాధనకై శ్రమించాలి ప్రముఖ కవి కొండూరు పోతన్న

టెన్త్ విద్యార్థులు లక్ష్యసాధనకై శ్రమించాలి

ప్రముఖ కవి కొండూరు పోతన్న

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 14

టెన్త్ విద్యార్థులు లక్ష సాధనకై నిరంతరంగా శ్రమించాలని ప్రముఖ కవి కొండూరు పోతన్న సూచించారు. మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆధ్యాత్మిక భావాలతో పాటు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కష్టపడాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు తెలుగు భాషలోని సందేహాలను నివృత్తి చేశారు మోడల్ పేపర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రంథ పఠనం విద్యార్థులలో జ్ఞానం పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల గ్రంథాలయానికి తాను రచించిన కొండూరు గుండె చప్పుడు, నర శతకం, అంకురాలు అను పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు సారథి రాజు, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment