మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 14, 2025
నిర్మల్ పట్టణంలోని నాయుడు వాడకు చెందిన మాన్పూరి రాములు గారి కుమారులు నరేష్, నవీన్ అన్నదమ్ములు గత వారం బంగల్‌పేట్ చెరువులో మృతి చెందడం అత్యంత బాధాకరమని నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, వశిష్ట విద్యాసంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
మంగళవారం ఆయన రాములు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పెద్ద కుమారుడు నరేష్ వశిష్ట కళాశాలలో 12 సంవత్సరాలుగా సీనియర్ క్లర్క్‌గా అంకితభావంతో పనిచేసి, సంస్థకు విశేష సేవలు అందించాడని గుర్తుచేశారు.
వీరి అకాల మరణం కుటుంబానికే కాకుండా, సంస్థకు కూడా లోటని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరుతూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్బంగా ఆయనతో పాటు ఎం. శంకర్, వశిష్ట కళాశాల ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.