తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన భీమారం నాయకులు.

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన భీమారం నాయకులు.

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన భీమారం నాయకులు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ను భీమారం బిజెపి నాయకులు సన్మానించారు. గత మూడు రోజుల క్రితం వేమన పల్లి అధ్యక్షుడు ఏట మధుకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు,కాగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు మధుకర్ స్వగ్రామం నీల్వాయికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో భీమారం మండల కేంద్రం లో అవడం ఎక్స్ రోడ్ వద్ద మండల అధ్యక్షుడు బొర్లకుంట శంకర్ ఆధ్వర్యంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర అధ్యక్షుని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్.రామచంద్రరావు మాట్లాడుతూ బిజెపి నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు,వేల్పుల రాజేశం యాదవ్, మాడెం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొమ్ము దుశాంత్, సెగ్గమ్ మల్లేష్ , అకుదారి శంకర్, కార్యదర్శి తాటిసమ్మ గౌడ్, శక్తి కేంద్రం ఇన్చార్జులు కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్, బూత్ అధ్యక్షులు ఆవిడ సురేష్, దుర్గం జనార్ధన్, ఆకుదారి మల్లేష్, ఆకుదారి చంద్రయ్య, మేడి విజయ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment