జర్నలిస్టులూ…సమిష్టిగా ఉండండి- సమస్యలపై పోరాడండి
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర
అధ్యక్షుడు మామిడి సోమయ్య
మనోరంజని తెలుగు టైమ్స్ సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 14
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులంతా సమన్వయంతో సమిష్టిగా ఉండాలని,జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా సంయుక్త కార్యదర్శి వంగాల వెంకన్న ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్ తదితరులు మంగళవారం తుంగతుర్తిలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా
మామిడి సోమయ్య మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కమిటీలలో ఉన్న బాధ్యులు,సభ్యులు యూనియన్ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని, అదే విధంగా బాధ్యతతో వ్యవరించి స్థానిక జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. అందరు ఐక్యతతో హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. వృత్తిలో నైపుణ్యతను, పనిలో పట్టుదలను పెంపొందించుకొని, క్రమశిక్షణతో కర్తవ్యాలను నెరవేర్చి సంఘం ప్రతిష్టలను పెంచాలని ఆయన కోరారు. సంఘం బాధ్యులెవరైనా సరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,తప్పులు చేసి సంఘం పరువుతీస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుండగాని జమున, అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు