ప్రజల నమ్మకం – మన గొప్ప బలం, ప్రతి కేసులో పారదర్శకత తప్పనిసరి: జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్
జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ
మనోరంజనీ – మహబూబ్‌నగర్, అక్టోబర్ 14, 2025 (M4News):
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ గారి సూచనలను వివరిస్తూ, వాటి అమలు కోసం జిల్లా స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ –
“మన ప్రధాన లక్ష్యం ప్రజలకు భద్రత, న్యాయం, మరియు నమ్మకం కల్పించడం. ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో పారదర్శకత, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి. ప్రజల నమ్మకమే మన గొప్ప బలం,” అని తెలిపారు.
ఎస్పీ జానకి సూచనలు:
-
NBW వారెంట్లు ప్రాధాన్యతగా అమలు చేసి, వారానికి నివేదిక సమర్పించాలి.
-
CCTNS అప్‌డేట్స్ సమయానికి నమోదు చేసి, పెండింగ్ FIRలు, చార్జీషీట్లు పూర్తి చేయాలి.
-
రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి: మద్యం సేవించి డ్రైవింగ్, నిర్లక్ష్య వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-
రోడ్ సేఫ్టీ టీమ్స్ ప్రతి సర్కిల్ స్థాయిలో ఏర్పాటు చేయాలి.
-
సస్పెక్ట్స్, రౌడీ షీట్లు పునర్విమర్శించి, తిరిగి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
-
మిస్సింగ్ కేసులు, సైబర్ నేరాలు పై ప్రత్యేక నిఘా పెట్టి, ప్రతి కేసులో న్యాయం జరిగేలా చూడాలి.
-
గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో ప్రజా పోలీసింగ్ బలోపేతం చేయాలని సూచించారు.
“ప్రతి పోలీస్ అధికారి నిజాయితీ, వృత్తి నిబద్ధతతో పనిచేస్తే ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది” అని ఎస్పీ జానకి అన్నారు.