ట్రంప్‌కు ఇజ్రాయెల్ నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు
డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం అపూర్వ గౌరవం కనబరిచింది. ప్రపంచానికి మరింత మంది ట్రంప్‌ల అవసరం ఉందని కీర్తిస్తూ గాజాతో శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించి విజయం సాధించిన ట్రంప్ గౌరవార్థం సభ్యులు లేచి నిలబడి అభినందనలు తెలిపారు. ట్రంప్‌ను శాంతి అధ్యక్షుడిగా అభివర్ణించిన పార్లమెంట్ వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును సిఫార్సు చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారానికి కూడా ట్రంప్ పేరును నామినేట్ చేశారు