విధుల పట్ల ఉపాధ్యాయుని నిర్లక్ష్యం!

విధుల పట్ల ఉపాధ్యాయుని నిర్లక్ష్యం!

విధుల పట్ల ఉపాధ్యాయుని నిర్లక్ష్యం!

మనోరంజని తెలుగు టైమ్స్  ప్రతినిధి

కొమురం భీం జిల్లా:అక్టోబర్ 13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తుంటే కొందరు ఉపాధ్యాయులు ప్రభుత్వ లక్ష్యాన్ని తుంగలో తొక్కు తున్నట్లు విద్యార్థి సం ఘాలు ఆరోపిస్తున్నాయి…

అందుకు నిదర్శనంగా ఈరోజు ఆసిఫాబాద్ మండలంలోని బనార్ గొంది, గిరిజన ప్రాథమిక పాఠశాల ఉ10 గంటల గడుస్తున్న పాఠశాల తెరుచుకోక పోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యా ర్థులు ఉపాధ్యాయుల రాక కోసం ఎదురు చూస్తూ పాఠశాల ఆరుబయట కూర్చోవడం చూసి పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కార్తీక్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment