ఏఐసీసీ పరిశీలకుల పర్యటనలు – డీసీసీ అధ్యక్షుల ఎంపికపై దృష్టి

ఏఐసీసీ పరిశీలకుల పర్యటనలు – డీసీసీ అధ్యక్షుల ఎంపికపై దృష్టి

ఏఐసీసీ పరిశీలకుల పర్యటనలు – డీసీసీ అధ్యక్షుల ఎంపికపై దృష్టి

 

  • నిర్మల్ జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన ప్రారంభం

  • డీసీసీ అధ్యక్షుల ఎంపికపై సమావేశాలు

  • రెండు రోజులపాటు నిర్మల్, ఖానాపూర్, ముధోల్ ప్రాంతాల్లో పర్యటన

 

నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు పరిశీలకులు అజయ్ సింగ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మిద్దెల జితేందర్ తదితరులు నేడు, రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. సమావేశాలు నిర్మల్, ఖానాపూర్, ముధోల్ ప్రాంతాల్లో జరుగనున్నాయి.

 

నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ సూచనల మేరకు పరిశీలకులు అజయ్ సింగ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మిద్దెల జితేందర్, జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్ రామ్ భూపాల్, లాకావత్ దణవతి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గార్లు రెండు రోజులపాటు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు తెలిపారు.

సోమవారం మంజులాపూర్ రోడ్డులోని మారుతి ఇన్ హోటల్‌లో మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం జరుగుతుంది. అనంతరం 2.30 గంటలకు ఖానాపూర్ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకుల సమావేశం, 2.50 గంటలకు నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్మల్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులతో, 11 గంటలకు మామడ మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు నాయకులతో ముఖాముఖి అనంతరం ముధోల్ నియోజకవర్గ పర్యటన ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment