అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ
బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 12
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు రోడ్డు- రైలు మార్గాల ద్వారా తరలివచ్చారు. అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి అక్షర మండపంలో అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి ఏర్పాట్లను పరిరక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.