స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడం తగదు – గోవింద్ నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడం తగదు – గోవింద్ నాయక్

– ఆదివాసి కాంగ్రెస్ పార్టీ, నిర్మల్ జిల్లా చైర్మన్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, అక్టోబర్ 9:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పై హైకోర్టు స్టే విధించడాన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి వాడుకోవడం సరైన చర్య కాదని, ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బానవత్ గోవింద్ నాయక్ శుక్రవారం తెలిపారు. బీసీలకు జనాభా మేరకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో సరైన వాటా ఇవ్వాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ప్రకటించారని తెలిపారు. కానీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని గోవింద్ నాయక్ విమర్శించారు.”బీసీలకు రాజకీయ పదవులు రావాలని కోరుకోవడం రేవంత్ రెడ్డి తప్పేనా? రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను అభ్యర్థించినా, ఆయన ఆమోదించకపోవడమే అసలైన సమస్య. ప్రధాని మోదీ బీసీ అని చెబుతూ, బీసీలకు వాటా ఇవ్వడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల హక్కుల కోసం గళం విప్పిన ఏకైక నాయకుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు బీసీ సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తాము చేస్తున్న డ్రామాలు ఆపాలని, బీసీల కోసం పనిచేసే నాయకులను విమర్శించడాన్ని నిలిపేయాలని గోవింద్ నాయక్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment