కాంగ్రెస్ వల్లే కోర్టులో స్టే: బీజేపీ స్టేట్ చీఫ్
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని, అసెంబ్లీలో బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్‌కు పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు బిల్లు పంపి 3 నెలలు కూడా ఓపిక పట్టలేదని, జీవో ఇచ్చి షెడ్యూల్ ప్రకటించడంలో లోగుట్టు ఏంటని ప్రశ్నించారు.