పెద్దకర్మ సందర్భంగా పేద కుటుంబానికి రెహమాన్ ఫౌండేషన్ చేయూత
10 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటిన సేవా దృక్పథం
మనోరంజని తెలుగు టైమ్స్ లింగాపూర్ ప్రతినిధి – అక్టోబర్ 09
లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన జాటోత్ హనుమంతు నాయక్ (70) ఇటీవల మృతి చెందారు. వారి పెద్దకర్మ సందర్భంగా రెహమాన్ ఫౌండేషన్ సంస్థ ఆ పేద కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వం చాటింది.
రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో రూ.10,000 విలువైన నిత్యావసర సరుకులను బుధవారం ఆ కుటుంబానికి సంస్థ సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “పేదలకు సేవ చేయడమే మా ధ్యేయం. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మనిషితనానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి,” అని రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ అన్నారు.
సంస్థ సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ మాట్లాడుతూ, “కొన్ని అనివార్య కారణాల వల్ల చైర్మన్ గారు స్వయంగా హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ, ఆయన సూచనల మేరకు కుటుంబానికి చేయూతనిచ్చాం. సామాజిక సేవ చేయడమే మా లక్ష్యం, అదే మా ప్రేరణ,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాధవ్ మారుతి, జాధవ్ రంజిత్, రాథోడ్ రాజేష్, రాథోడ్ ధర్మేందర్, జాధవ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.