అడవి బిడ్డల పోరు ఢిల్లీ గద్దెను తాకాలి*

*అడవి బిడ్డల పోరు ఢిల్లీ గద్దెను తాకాలి*

•ఓ ఆదివాసి రా…
కదలిరా భద్రాద్రి నడిబొడ్డున మహా ధర్మ యుద్ధం ప్రకటిద్దాం

••లంబాడీలు గిరిజనులు కాదని గొంతెత్తి నినదిద్దాం

••ఆదివాసి అస్తిత్వం కై పోరాటం సాగిద్దాం

••ఆదివాసి సంక్షేమ పరిషత్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కుంజ రమాదేవి

మనోరంజని తెలుగు టైమ్స్

భద్రాచలం సెప్టెంబర్ 25;

సెప్టెంబర్ 28 వ తేదీన భద్రాచలం నడిబొడ్డున కాలేజీ గ్రౌండ్ నందు ఆదివాసుల మహా ధర్మ యుద్ధ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కుంజ రమాదేవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆదివాసులు ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా సాంఘికంగా అనగదొక్కబడుతున్నారని ఆదివాసులను మేల్కొల్పేందుకై భద్రాచలంలో మహా ధర్మ యుద్ధ భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నామని ఆమె ప్రకటించారు లంబాడీలు గిరిజన తెగ కాదని వలసవాదులనీ అటువంటి వలసవాదులను గిరిజన తెగల్లో కలపటం అత్యంత దారుణమైన అంశమని ఆమె పేర్కొన్నారు ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చడం వలన అసలైన ఆదివాసి తెగకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆమె మండిపడ్డారు ఎక్కడో రాజస్తాన్ మహారాష్ట్ర మూలాలు కలిగిన వాళ్లు ఓబీసీలుగా ఉన్నవారిని ఎస్టీలుగా ఎలా గుర్తిస్తారని ఆమె ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వలన ఆదివాసి తెగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన తెలిపారు లంబాడీలు ఎస్టీ హోదాలో అనేక ప్రభుత్వ పరమైన రిజర్వేషన్లు పొందారని అన్ని రంగాల్లో వాళ్లు స్థిరపడ్డారని ఇప్పటికైనా లంబాడీలను ఎస్టి హోదాను తొలగించి ఆదివాసులకు న్యాయం చేయాలని ఆమె ఉద్ఘాటించారు పల్లె నుండి ఢిల్లీ దాకా ఆదివాసుల శక్తిని చాటాలని ఆమె హితువు పలికారు అడవిని నమ్ముకొని ఆదివాసులు తరతరాల జీవనం కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు ఆదివాసులను ఈ ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు వలసవాదులు ఓబిసి హోదాలో ఉన్న లంబాడీలను ఎస్టి జాబితాలో చేర్చి ఆదివాసి తెగల ను విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో దూరం ఉంచుతున్నారని ఆమె మండిపడ్డారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిగిన తప్పును సరిదిద్దుకొని ఎస్టీ హోదాను కలిగి ఉన్న లంబాడాలను తక్షణమే తొలగించి ఆదివాసి తెగలకు న్యాయం చేకూర్చాలని ఆమె డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆదివాసుల తిరుగుబాటుకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment