ఓటు దొంగలను పట్టేద్దాం.. ప్రజల బోనులో పెట్టేద్దాం..
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి..
ఓటు చోరీపై సంతకాల సేకరణ..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం..
భారీ ఎత్తున జరగనున్న సంతకాల సేకరణ..
ఓటు దొంగలను పట్టుకొని ప్రజల బోనులో పెట్టే కార్యక్రమానికి రంగం సిద్ధమైందని.. ఇందుకోసం ప్రతి కార్యకర్త ముందుకు రావాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓట్ చొరీ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిసిసి అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలుపుమేరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా ,పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరూ తమ తమ వార్డు గ్రామాలలో ఒక్కో కార్యకర్త 20 నుంచి 30 మంది ద్వారా సంతకాల సేకరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంతకాల సేకరణ తర్వాత ఈ పత్రాలను డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారికి ఇవ్వాలని సూచించారు.
దెబ్బకుఠా.. దొంగల ముఠా..
ఓటును చోరీ చేసి ఇంతకాలం అక్రమంగా గద్దెను ఏలుతున్న బిజెపికి బుద్ధి చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి వెల్లడించారు. పెంచిన ధరల భారంతో నిరుపేదలు, సామాన్యుల నడుములు వచ్చి లాంటి ఆదాని, అంబానీ లాంటి పెద్దమనుషులకు ఊడిగం చేస్తున్న బిజెపిని గద్యదించే దాక ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడిందని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి అంకితభావంతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు