చైర్మన్‌ను ఘనంగా సన్మానించిన కౌట్ల (బి) అడెల్లి భక్తులు

చైర్మన్‌ను ఘనంగా సన్మానించిన కౌట్ల (బి) అడెల్లి భక్తులు

చైర్మన్‌ను ఘనంగా సన్మానించిన కౌట్ల (బి) అడెల్లి భక్తులు

మనోరంజని, తెలుగు టైమ్స్, నిర్మల్ జిల్లా అక్టోబర్ 05

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవస్థానం వద్ద గత నెల 28, 29 తేదీలలో ఘనంగా నిర్వహించిన గంగ నీళ్ల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినందుకు ఆలయ కమిటీపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో, ఆదివారం రోజున కౌట్ల (బి) గ్రామానికి చెందిన భక్తులు, స్థానిక దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఎగువశ్రేణి అధికారి అంబడిపల్లి రాజేష్, సేవాదారులు తుమ్మ సాయన్న మరియు కమ్మంపెళ్లి లక్ష్మణ్ గార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, వారి సేవలను ప్రశంసిస్తూ సన్మానితులకు శాలువాలు కప్పి, స్మృతి చిహ్నాలు అందజేశారు. స్థానిక స్థాయిలో సేవలు అందించిన ఈ ధర్మబద్ధ కార్యకర్తలు భక్తుల మన్ననలు అందుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment