బుద్ధుని బోధనలు అనుసరణీయం
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 5
ప్రపంచానికి శాంతి అహింసాయుత మార్గాన్ని చూపిన బుద్ధుని బోధనలు అనుసరణీయమని భైంసా బుద్ధ విహార్ టీం సభ్యులు అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలోని బుద్ధ విహార్(టెక్డి)లో బుద్ధవందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు. బౌద్ధ ఉపాసకులకు త్రిశరణాలు, పంచశీలాలను అందించారు. బుద్ధ వందన కార్యక్రమానికి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన ఉపాసకులు, మహిళలు, చిన్నారులు విధిగా హాజరవుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఉపాసకులు సైతం కుటుంబ సమేతంగా బుద్ధ విహార్ కు వచ్చి బుద్ధ వందన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బుద్ధ విహార్ అభివృద్ధికి ఉపాసకులు ఆర్థిక సహాయం అందించాలని టీం సభ్యులు కోరారు. అందరి సహకారంతోనే బుద్ధ విహార్ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉపాసకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.