స్థానిక ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. ?

స్థానిక ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. ?

స్థానిక ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. ?

స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా?

ఖర్చుపై ఆశావహుల డైలమా

అత్యధిక చోట్ల దసరా దావత్‌లకూ దూరమే

కొన్నిచోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ

కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడమే కారణం

ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు

షెడ్యూలు వచ్చినా కనిపించని ‘లోకల్‌ జోష్‌’

మరోవైపు.. సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు

ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్నిచోట్ల యత్నాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చిందంటే చాలు.. గ్రామాల్లో ఆ జోషే వేరు! అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారీగా గ్రూపులు కడతారు! ఖర్చు విషయంలో ఆశావహులు తగ్గేదే లేదన్నట్టు పెడుతుంటారు. షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు అస్సలు వెనుకాడరు. కానీ, ఈసారి పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావహులు.. తమకే టికెట్‌ వస్తుందని అనుకుంటున్నవారు.. అభ్యర్థి తానేనని కొంతవరకూ ఖరారైన వారిలోనూ ఒక రకమైన డైలమా కనబడుతోంది. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిజానికి, షెడ్యూల్‌ విడుదలైన తర్వాత దసరా రావడంతో రాజకీయ దావత్‌లు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ, ఈసారి కొన్నిచోట్ల దావత్‌లు గట్టిగా జరిగితే.. మరికొన్నిచోట్ల ‘ఇంకా సమయం ఉందిగా’ అనే మాటతో సరిపెట్టేశారు. ఇందుకు కారణం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రిజర్వేషన్లు మారడం, సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడం.. రెండు, మూడ్రోజుల్లో వాటిపై విచారణలు ఉండడమే. విచారణల తర్వాత కోర్టులు ఏం తీర్పునిస్తాయో చూసి, ముందుకెళ్తే బాగుంటుందని నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోష్‌ కనబడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, రిజర్వేషన్లు మారడంతో తమకే టికెట్‌ వస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురైంది. వాళ్లు చప్పుడు చేయడం లేదు. రిజర్వేషన్ల మార్పుతో టికెట్‌ తమకే వస్తుందనుకుంటున్న వారు కూడా కోర్టు విచారణల నేపథ్యంలో అడుగు ముందుకు వేయడం లేదు. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారోననే ఆందోళన ఒకవైపు.. ఇప్పుడే ఖర్చు చేస్తే కోర్టుల్లో తీర్పు వచ్చాక పరిస్థితి ఏమిటోననే భయం మరోవైపు వెన్నాడుతున్నాయి. ఓటర్లు తమవైపు చూస్తున్నారని, కోర్టు తీర్పుల్లో ఏం జరుగుతుంది? ఖర్చు చేయాలా వద్దా!? అంటూ పార్టీ కార్యాలయాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడొకరు చెప్పారు. కొన్నిచోట్ల మాత్రం ఓటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ రాత్రి సమావేశాలు మొదలయ్యాయి. వీటిలో ఖర్చే ప్రధానంగా చర్చకు వస్తోందని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన ఓ పార్టీ నాయకుడు చెప్పారు. ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల ఖర్చులు మొదలుపెట్టగా, దక్షిణ తెలంగాణలో మోస్తారుగానే ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మధ్యస్థంగా ఉంది. మరి కొన్నిచోట్ల ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పార్టీలవారీగా అభ్యర్థుల జాబితాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార, విపక్షాలు అభ్యర్థుల జాబితాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఆయా స్థానాలవారీగా 5 వరకు పేర్లను పంపాలని డీసీసీలకు పీసీసీ సూచించింది. బీఆర్‌ఎస్‌ కూడా క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. గతంలో పార్టీ కోసం పని చేసిన వారు, బలంగా ఉన్నవారి కోసం చూస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. అవసరమైన కసరత్తును ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నా.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో జాబితాల్లో తమ పేరు ఉండేలా కొంతమంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలన్నీ ఆశావహులతో నిండిపోతున్నాయి. మరోవైపు పొత్తుల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ జోష్‌ లేదు.. జెండాల ఆర్డర్లు లేవు

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చిందంటే ఆ ఉత్సాహం, జోష్‌ చెప్పలేని స్థాయిలో ఉండేదని, ఈసారి అది కనిపించడం లేదని ఖమ్మంలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని చెప్పారు. షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచే కరపత్రాలు, ఫ్లెక్సీలు, జెండాలు, కండువాల కోసం నాయకులు వచ్చేవారని, ఆర్డర్లు రావడంతో తమకు ఊపిరి సలపనంత పని ఉండేదని, ఈసారి ఊహించిన స్థాయిలో ఆర్డర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment