ఉట్నూర్ జడ్పిటిసి బరిలో సొంటకే శ్రీకాంత్

ఉట్నూర్ జడ్పిటిసి బరిలో సొంటకే శ్రీకాంత్

మనోరంజని, తెలుగు టైమ్స్ – అదిలాబాద్, అక్టోబర్ 05

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మండలాల రిజర్వేషన్లు విడుదల కావడంతో, పోటీదారుల ఉత్సాహం పెరిగి, ప్రతిరోజూ కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామానికి చెందిన సొంటకే శ్రీకాంత్ ఉట్నూర్ జడ్పిటిసి స్థానానికి బీసీ రిజర్వేషన్ కేటగిరీలో బీజేపీ తరఫున పోటీలో నిలవనున్నారు. శ్రీకాంత్ గత 16 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో యువ నాయకుడిగా సేవలందిస్తూ, పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలో లక్షేట్‌పేట్ ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన ఆయన, పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా ప్రసిద్ధి పొందారు. ఈసారి జడ్పిటిసి స్థానానికి బీసీ రిజర్వేషన్ కలవడంతో, శ్రీకాంత్ బలంగా పోటీలో ఉన్నారు. ఉట్నూర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీజేపీ కార్యకర్తల మద్దతు ఆయనకు లభిస్తుండటం విశేషం.శ్రీకాంత్‌ అభ్యర్థిత్వానికి మద్దతుగా, ఆదిలాబాద్ ఎంపీ జి. నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం కలిసి, పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించి బీఫామ్ (B-form) ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment