తెలంగాణకు సీఎం అయ్యేంతవరకు పోరాడుతా: డీకే అరుణ

తెలంగాణకు సీఎం అయ్యేంతవరకు పోరాడుతా: డీకే అరుణ

మనోరంజని తెలుగు టైమ్స్ పాలమూరు ప్రతినిధి అక్టోబర్ 05

ఉమ్మడి పాలమూరు బీజేపీ ఎంపీ డీకే అరుణ, తాను తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టారు. ఈ మేరకు ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలని, తాను మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నానని ఆమె అన్నారు. సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, నిర్ణయం తన చేతుల్లో లేకపోయినా, తొలి మహిళా సీఎం కావడానికి కృషి చేస్తూనే ఉంటానని అరుణ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment