ఉద్యమనేత సర్పంచ్ బరిలో – అభివృద్ధికి నాంది : షెల్కే లక్ష్మీ బాయి ఆనంద్
మనోరంజని, తెలుగు టైమ్స్, కుబీర్ ప్రతినిధి | అక్టోబర్ 05
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ ఉద్యమనేత షెల్కే ఆనంద్, వికలాంగులు, పింఛనుదారులు, ఇతర సామాజిక సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందారు. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో, మాలేగాం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎస్సి మహిళ కోటా కేటాయించడంతో, ఆయన సతీమణి షెల్కే లక్ష్మీ బాయి బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆశీర్వాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షెల్కే ఆనంద్ తెలిపారు. “ఈ సారి అవకాశం కల్పిస్తే మాలేగాం గ్రామ అభివృద్ధికి తగిన కృషి చేస్తాం,” అని వారు పేర్కొన్నారు.