త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు – ఈసీ కీలక నిర్ణయం

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు – ఈసీ కీలక నిర్ణయం

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు – ఈసీ కీలక నిర్ణయం

హైదరాబాద్, అక్టోబర్ 04 (M4News):

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మిగిలిన మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుందని తెలిపింది. ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు లేదా ఎన్నికలకు సంబంధించిన ఏవైనా అంశాలపై 92400‌21456 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment