కన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవం

కన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవం

కన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంప్రదాయ నృత్యాలు

బందోబస్తు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 4

కన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవం

కన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవంకన్నుల పండువగా దుర్గామాత నిమజ్జనోత్సవం

మండల కేంద్రమైన ముధోల్ లో శుక్రవారం రాత్రి దుర్గామాత నిమజ్జనోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు దుర్గామాతలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అదేవిధంగా యువకులు భవాని దీక్షలను నియమనిష్ఠలతో చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ప్రతిష్టించి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. శోభాయాత్రలో సాంప్రదాయపద్ధంగా కోలాటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల దుర్గామాత శోభాయాత్ర బందోబస్తును పర్యవేక్షించారు. పోలీస్ అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎంతో ఉత్సాహంగా కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో స్థానికులు పాల్గొని నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం స్థానిక చెరువులతో పాటు గోదావరి నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు. గ్రామంలో నిమజ్జోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ముధోల్ సిఐ జి. మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును చేపట్టారు. అదేవిధంగా పలు గ్రామాల్లో సైతం భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్రను నిర్వహించారు. గ్రామస్తులు అందరూ పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment