కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్

భైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 4

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు అప్పనోళ మురళి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సోదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందని వెల్లడించారు. మురళితో పాటు సురుగుల శ్రీనివాస్, సతీష్, ప్రణయ్, ముత్యం సైతం బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రె, ముత్యంరెడ్డి, కుబీర్ మండల అధ్యక్షులు బషీరుద్దీన్, సీనియర్ నాయకులు బంక బాబు, నాయకుడు పురంశెట్టి రవికుమార్, శివాజీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment