పాలు తాగే వయసులోనే రిచెస్ట్ కిడ్‌గా హీరోయిన్ కూతురు
మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025
బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రాహాపై అపారమైన ప్రేమను చూపిస్తోంది. పాలు తాగే వయసులోనే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత రిచెస్ట్ కిడ్‌గా రాహా పేరు నమోదు చేసుకుంది.
అలియా భట్ తన కూతురి పేరు మీద సుమారు ₹250 కోట్ల విలువైన బంగ్లాను రాసిచ్చినట్టు సమాచారం. ఇటీవల అలియా మాట్లాడుతూ – “ఒక తల్లిగా నేను రాహా కోసం ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. ఆమె టీనేజ్‌కి చేరేసరికి ఊహించని ఆశ్చర్యాన్ని కలిగిస్తాను” అని తెలిపింది.
ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.