భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం

భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం

భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం

పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

బందోబస్తు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి భైంసా అక్టోబర్ 03

భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం

భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవంభక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవంభక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవంభక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవంభక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం

బైంసా పట్టణంలో శ్రీ దుర్గా మాత నిమజ్జోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భవాని చౌక్ వద్ద మహిషాసుర మర్దిని శోభాయాత్రను ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. పట్టణంలోని వివిధ వాడల్లో ప్రతిష్టించిన దుర్గామాతలను ప్రత్యేక వాహనాలపై ప్రతిష్టించి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులను చేతబట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం నిమజ్జనం శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. యువకులు, చిన్నారులు శోభాయాత్రలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన భక్తులకు ప్రధాన కూడల్లో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వయంగా భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో బట్టి బందోబస్తు నిర్వహించారు. మొత్తం బందోబస్తులో 300 మంది పోలీసులు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 12 మంది సిఐలు, 15 మంది ఎస్సైలు పాల్గొన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా ప్రధాన వీధుల గుండా కొనసాగి గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జనం చేశారు. దుర్గామాత నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని బైంసాలో పండగ వాతావరణం నెలకొంది

Join WhatsApp

Join Now

Leave a Comment