పేదింటి బిడ్డకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి
భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన కంమ్లె శైలజ పట్టుదలతో చదివి నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించింది.
శైలజ తండ్రి పరుశురాం మోటార్ మెకానిక్, తల్లి అనిత బీడీ కార్మికురాలు. పేదరికంలోనూ కష్టపడి చదివి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గ్రామంలోనే కాదు, మండల వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది.
ఆమె సోదరుడు కంమ్లె శరత్ ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. కూతురి విజయంతో తల్లిదండ్రులు గర్వంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు.
గ్రామంలో ఘన సత్కారం
ఈ సందర్భంగా యువకులు కంమ్లె సాయినాథ్, సిహెచ్ ఎల్లన్న, కార్బరి భూమన్న, ఎమ్మార్పీఎస్ కుంటాల మండల అధ్యక్షుడు కత్తి బాబు, కదం మారుతీ, దగ్డే దీపక్, కదం ఆనంద్ తదితరులు శైలజను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
గ్రామస్తులు, బంధుమిత్రులు అందరూ శైలజ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.