చెడుపై మంచి సాధించిన విజయానికి సాంకేతంగా జరుపుకునే పండుగ దసరా పండుగ….
చిన్న వడ్డపల్లి చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాలలో భాగంగా భారీ రావణాసురుని ప్రతిమను దహనం..
రావణ దహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ వడ్డేపల్లి చెరువు సమీపంలో తొలిసారి ఏర్పాటు చేసిన రావణ వధ కార్యక్రమానికి గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా ఉత్సవాలలో భాగంగా భారీ రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్స్ షో ఎంతగానో ఆకట్టుకున్నాయి…
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ;-…
చెడుపై మంచి సాధించిన విజయానికి సాంకేతంగా జరుపుకునే పండుగ దసరా పండుగ అని తెలిపారు. భారతదేశ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ఏనుమాముల పరిధిలోని చిన్న వడ్డపల్లి చెరువు సమీపంలో తొలిసారి ఇంత పెద్ద ఎత్తున రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించిన నిర్వకులను ఎమ్మెల్యే నాగరాజు గారు నిర్వాహకులను ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు…
దసరా పండుగ చెడుపై మేలుజయానికి ప్రతీక. రావణ వధ ఉత్సవం మన సమాజంలో సత్యం, ధర్మం ఎల్లప్పుడూ నిలుస్తాయనే సందేశాన్ని అందిస్తుంది. యువతలో మంచి విలువలు, సాంప్రదాయాల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తం. సాంస్కృతిక విలువలు, భక్తి, ఐకమత్యం కలగలిపే ఉత్సవాలను ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలి. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులు, నాయకులు, నిర్వాహకులు, యువకులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..