శోభమ్మ, విఠల్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – నిజామాబాద్
నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి శోభమ్మ , మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉదయం విఠల్ రావు జానకంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కను నాటారు. అలాగే గాంధీ జయంతి సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బి.రమణారావు, శ్రీనివాస్ రావు, దాదన్నగారి సందీప్ రావు, దాత్రిక్ అంజయ్య, డి.రమణారావు, శేఖర్ రాజు, నీలం రెడ్డి, న్యాలం కిషన్, విజయ్ కుమార్, సంగారెడ్డి, తిప్పరమైన కృష్ణప్రసాద్, జలపతి రావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ బోజ నారాయణ, జిల్లా ఇంచార్జి శ్రీకాంత్, అర్బన్ ఇంచార్జి విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.